- సత్తాచాటిన హైదరాబాద్ కేఎల్‌హెచ్
- జాతీయ స్థాయిలో 22వ ర్యాంకు కైవసం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 31 (విజయక్రాంతి): దేశంలోని అత్యుత్తమ ప్రమాణా లు పాటించే విద్యా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్‌లో కేఎల్‌హెచ్ హైదరాబాద్ క్యాంపస్.. జాతీయ స్థాయిలో 22వ ర్యాంకు సాధించిందని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పార్థపారథి వర్మ హర్షం వ్యక్తం చేశారు. శనివారం జూబ్లీహిల్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ తమ హైదరాబాద్ క్యాంపస్ అత్యుత్తమ పనితీరును కనబరిచినందుకు గాను ఈ ర్యాంకును కేంద్ర మావన వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించిందని ఆయన చెప్పారు.
దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ కళాశాలలు, ఐఐటీలు, ఎన్‌ఐటీలు మొత్తం కలిపి 6,517 విద్యాసంస్థలు పోటీపడగా తమ వర్సిటీకి 22వ ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సమావేశంలో కేఎల్‌హెచ్ హైదరాబాద్ క్యాం పస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ కోటేశ్వరరావు, యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.