calender_icon.png 4 January, 2025 | 4:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు హీరోతో ప్రేమలో..

02-01-2025 01:07:38 AM

హీరోయిన్ రష్మిక మందన్నా ప్రేమలో ఉందంటూ చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. హీరో విజయ్ దేవరకొండతో రష్మిక ప్రేమలో ఉందంటూ ప్రచారం కొన్నేళ్లుగా జరుగుతోంది. దీనిపై రష్మిక, విజయ్‌లలో ఒక్కరు కూడా స్పందించలేదు. కానీ పరోక్షంగా మాత్రం రూమర్స్‌కు బలం చేకూర్చేలా ఇద్దరూ వ్యవహరిస్తున్నారు.

ఇటీవల ఓ సందర్భంలో విజయ్ సమయం వచ్చినప్పుడు ప్రేమ, పెళ్లి విషయాలు బయటపెడతానని చెప్పాడు. రష్మిక మాత్రం ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని తెగేసి మరీ చెబుతోంది. అయితే రష్మిక ప్రేమ, పెళ్లి గురించి తాజాగా ప్రొడ్యూసర్ నాగవంశీ స్పందించారు. ఆయన నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షోకు గెస్ట్‌గా వెళ్లారు.

ఆ షోలో రష్మిక గురించి నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం నెట్టింట అవి తెగ వైరల్ అవుతున్నాయి. రష్మిక ప్రేమ వ్యవహారం తనకు తెలుసని.. ఆమె ఓ తెలుగు హీరోతో ప్రేమలో ఉందని తెలిపారు. అతడినే రష్మిక పెళ్లి చేసుకుంటుందని సైతం తెలిపారు. దీంతో ఆ తెలుగు హీరో విజయ్ దేవరకొండేనని నెటిజన్లు ఫిక్స్ అయిపో తున్నారు.