మనలో చాలామందికి పాతసినిమాలు, పాటలు వాటికి సంబధించిన విషయాలమీద ఆసక్తి ఉంటుంది. అయితే ఇప్పుడంటే.. మ్యూజిక్ సౌండ్స్, డీజే పాటలు వింటూ మైమరిచిపోతున్నాం. కానీ అప్పట్లో పాటలు వినాలంటే ఏకైక సాధనం గ్రామఫోన్ మాత్రమే. 1950-60లో ఆతరంవాళ్లు గ్రామఫోన్‌లో అనాటి మధుర పాటలు వింటూ సంగీతాన్ని ఆస్వాదించేవారు. గ్రామఫోన్లలో ప్లే అయ్యే పాటలు మహా ఆసక్తిగా ఉండేవి. లాహిరి లాహిరి లాహిరిలో.. ఊహలు గుసగుసలాడే లాంటి పాటలు ఎంతో అద్భుతంగా వినిపించేవి అప్పట్లో.