మూడేళ్లలో పదో విస్పోఠనం
న్యూఢిల్లీ, నవంబర్ 21: ఐస్‌లాండ్ రాజధానికి రెక్‌జ్వాక్ సమీపంలోని ఓ అగ్నిపర్వతం బుధవారం బద్దలై దాని లావా ఫౌంటెన్ల మాదిరి కిందకు జారుతోంది. గత మూడేళ్లలో ఈ అగ్నిపర్వతం పదోసారి బద్ధలైనట్లు ఆ దేశ వాతావరణ కార్యాలయం తెలిపింది. దాదాపు 4 లక్షల మంది నివాసముండే ఐస్‌లాండ్, యురేషియన్, ఉత్తర అమెరికా టెక్టోనిక్ ప్టేట్ల మధ్య ఈ అగ్నిపర్వతం కేంద్రీకృతమై ఉంది.
ఇక్కడ ఏర్పడే విస్పోఠనంతో ఎక్కువగా ఐస్‌లాండ్ రాజధాని రేక్‌జానెస్ ప్రభావితం అవుతోంది. దాదాపు 800 సంవత్సరాల పాటు నిద్రావస్థలో ఉన్న ఈ అగ్నిపర్వతం గత మూడేళ్లుగా తన ఉగ్రరూపం చూపిస్తుడటంతో.. దాని చుట్టుపక్కల ఉండేవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఐస్‌లాండ్‌లో దాదాపు 33 వరకు యాక్టివ్ అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఈ సంఖ్య యూరోపియన్ దేశాల కంటే ఎక్కువ.