calender_icon.png 22 March, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ. 40,608 కోట్లు

15-07-2024 12:05:00 AM

న్యూఢిల్లీ, జూలై 14: జూన్ నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో ఇన్వెస్టర్లు రికార్డుస్థాయిలో రూ. 40,608 కోట్లు పెట్టుబడి చేశారు. 2024 మే నెలకంటే జూన్‌లో ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చిన నిధులు 17 శాతం పెరిగినట్టు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ (యాంఫి) తెలిపింది. ఎంఎఫ్ పరిశ్రమ ఈక్విటీ స్కీముల నిర్వహణలోని మొత్తం ఆస్తులు ప్రస్తుతం రూ.27.67 లక్షల కోట్లకు చేరినట్టు యాంఫి వెల్లడించింది.