calender_icon.png 17 January, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగునీటి సరఫరాలో..నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

03-09-2024 04:08:50 AM

మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగర పరిధిలో తాగునీటి సరఫరాలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని రాష్ర్ట పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దాన కిషోర్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం మాసబ్ ట్యాంక్‌లోని తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీయూఎఫ్‌ఐడీసీ) ప్రధాన కార్యాలయంలో.. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ తదితర ఉన్నతాధికారులతో తాగునీటి సరఫరాపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలన్నారు. భారీ వర్షాలకు జలమండలికి సంబంధించిన ఆస్తుల నష్టం వివరాలపై నివేదిక అందించాలన్నారు.