calender_icon.png 30 April, 2025 | 3:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు ఉమ్మడి జిల్లాలో ఇంచార్జ్ మంత్రి పర్యటన

15-04-2025 01:16:31 AM

-పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, అధికారులతో సమీక్షలు

నిజామాబాద్ అర్బన్,  ఏప్రిల్ 14(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుండి బయలుదేరి  కామారెడ్డి జిల్లాకు చేరుకుంటారు.

అక్కడ వ్యవసాయ , పౌర సరఫరాల , మార్కెటింగ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ , గ్రామీణ,పట్టణ శాఖ, నీటి సరఫరాకు సంబంధించిన అధికారులతోనూ సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం కామారెడ్డి నుండి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం చేరుకొని  సన్న బియ్యం లబ్ధిదారులతోని సహాపంక్తి భోజనం చేయనున్నారు.

తర్వాత క్షత్రియ ఫంక్షన్ హాల్ లో లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందించనున్నారు. మూడు కోట్ల రూపాయలతో మినీ ట్యాంక్ బండ్ కు  ఫౌండేషన్ స్టోన్ వేయనున్నారు.. సాయంత్రం నాలుగు గంటలకు  ఆర్మూర్ నుండి బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మున్సిపల్  కార్యాలయనికి చేరుకుంటారు. అక్కడ సహస్ర ఫంక్షన్ హాల్లో షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయనున్నారు. భీమ్గల్ నుండి మోర్తాడు  కు చేరుకొని విరామం తీసుకుని హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు.