పత్తిపాక రిజర్వాయర్ నిర్మించి తీరుతాం...
అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట..
సీఎం రేవంత్ రెడ్డి సభ విజయవంతానికి కృతజ్ఞతలు..
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు.
పెద్దపల్లి (విజయక్రాంతి): తెలంగాణలో అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే నేను ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏడాదిలో పెద్దపల్లి నియోజకవర్గానికి వివిధ అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు తెలిపారు. శుక్రవారం పెద్దపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెద్దపల్లి ప్రజల చిరకాల స్వప్నం పెద్దపల్లిలో ఆర్టీసీ బస్ డిపో మంజూరు చేయించానని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాకు వర ప్రధాయనిగా నిలవబోయే పత్తిపాక రిజర్వాయర్ డీపీఆర్ పనుల కోసం రూ. 5 కోట్లు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
పెద్దపల్లి నియోజకవర్గంలో సుమారు రూ. 300 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు, అలాగే పెద్దపల్లి వాంఛ రూ. 82 కోట్ల రూపాయలు బైపాస్ రోడ్డు, కోర్టు భవనానికి రూ.81 కోట్లు, ఓదెల మండలం రూపు నారాయణపేట మానేరు హై లెవెల్ వంతెన కోసం రూ. 80 కోట్ల రూపాయలు మంజూరు చెపించానని అలాగే పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల నుండి 100 పడకలకు రూ. 51 కోట్ల రూపాయల నిధులతో అప్గ్రేడ్ చెపించడం జరిగిందని రూ. 5 కోట్ల నిధులతో ఇందిరా మహిళా స్వశక్తి భవనం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని, అలాగే పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ నూతన భవనానికి రూ.5 కోట్లతో మంజూరు చేశామని పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రూ. 51.14 కోట్లు, రోడ్లు, భవనాల శాఖ నుండి రూ. 301.34 కోట్లు, పెద్దపల్లి మున్సిపల్ కు రూ. 77.86 కోట్లు, సుల్తానాబాద్ మున్సిపల్ కు రూ. 31.53 కోట్లు, విద్యుత్ శాఖ ద్వారా రూ. 25.89 కోట్లు, వ్యవసాయ శాఖ ద్వారా రూ. 33,706 రైతులకు గాను 243.80 కోట్లు రుణమాఫీ చేశామని, రైతు బీమాతో 209 మరణించిన రైతు కుటుంబాలకు 10.95 కోట్లు, ఈరోజు వరకు సన్న రకాల వడ్ల రైతులు 10,488 రైతులకు రూ. 35.33 కోట్ల రూపాయలు బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేశామని వ్యవసాయ మార్కెట్ల గిడ్డంగులకు 1.81 కోట్లు, నీటిపారుదల శాఖ ద్వారా మంచి నీటి సరఫరాకు 2.06 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కల సహకారాలతో అలాగే జిల్లా మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో మంజూరు చెపించానని ప్రకటించారు.
అలాగే నూతనంగా ఎలిగేడు పోలీసు స్టేషన్, పెద్దపల్లి రూరల్ పోలీసు స్టేషన్ తో పాటు మహిళా పోలీసు స్టేషన్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్ మంజూరు చేపించానని తెలిపారు. రానున్న నాలుగేళ్లలోపు పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసి పెద్దపల్లి జిల్లాలోని చివరి ఆయకట్టు భూములకు సాగు నీరందిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్, ధర్మపురి, చొప్పదండి, రామగుండం, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లో 2 లక్షల 40 వేల ఎకరాలు పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే సస్య శ్యామలమవుతాయన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకు రైతు రుణ మాఫీతో 80 శాతం మందికి ఇప్పటికే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో 3500 మంది సీఎంఆర్‌ఎఫ్ దరఖాస్తు చేసుకోగా, 2వేల మందికి పైగా రూ. 9.5కోట్లను మంజూరు చేసి పంపిణీ చేసినట్లు, 140 మందికి వివిధ ఆస్పత్రుల్లో వైద్య ఖర్చుల కోసం ఎల్‌ఓసీలు ఇప్పించానని తెలిపారు.
రూ. 1309 మందికి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా రూ. 13.10 కోట్లు, 300 పేద విద్యార్థులకు గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు కల్పించామని తెలిపారు. పత్తిపాక రిజర్వాయర్ గతంలో పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం జూటా మాటలు చెప్పి రైతులను మోసం చేసింది. మండిపడ్డ ఎమ్మెల్యే విజయ రామారావు పత్తిపాక రిజర్వాయర్ ను గతంలో పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం జూటా మాటలు చెప్పి రైతులను మోసం చేసిందని ఎమ్మెల్యే విజయరామరావు మండిపడ్డారు. గొప్పలు చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పెద్దపల్లికి చుక్క నీరైనా సాగు నీరందించారా.. ప్రజలకు సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్ నాయకులను డిమాండ్ చేశారు. వసతి గృహాల్లోని విద్యార్థులకు 40 శాతం మెస్ ఛార్జీలను పంచామన్నారు. నిరుద్యోగులకు భరోసా కల్పిస్తూ.. ఉద్యోగాలు కల్పించామని, ఏడాది కాలంలో 61వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ సర్కారుకే దక్కిందన్నారు. రానున్న నాలుగేళ్ల కాలంలో పెద్దపల్లి నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి పథంలో ముందు వరసలో నిలుపుతానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అలాగే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.
ఈనెల 4న సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న యువ వికాసం విజయోత్సవ సభ విజయవంతం పట్ల విజయోత్సవ సభ విజయవంతంలో పాలుపంచుకున్న జిల్లా, నియోజకవర్గ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలకు, జిల్లాలోని ప్రజలకు ఎమ్మెల్యే విజయరమణ రావు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి శ్రీధర్ బాబుల సహకారంతో గతంలో ఏ ప్రజాప్రతినిధి చేయని విధంగా పెద్ద ఎత్తున నిధులు మంజూరుకు సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియాకు, మంత్రులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్లు ఈర్ల స్వరూప, ప్రకాశ్‌రావు, కాంగ్రెస్ నాయకులు బుషనవేని సురేశ్ గౌడ్, గోపగాని సారయ్య గౌడ్, బండారి రామ్మూర్తి, నూగిళ్ల మల్లయ్య, సందనవేని రాజేందర్ యాదవ్, మస్రత్, బొడ్డుపల్లి శ్రీనివాస్, భూతగడ్డ సంపత్, సింగిల్ విండో చైర్మన్ లు చింతపండు సంపత్, మాదిరెడ్డి నర్సింహరెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.