calender_icon.png 13 March, 2025 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తను జతగా లేని కథలో..

13-03-2025 01:06:01 AM

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కాలమేగా కరిగింది’. ఈ సినిమాను సింగార క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు. సింగార మోహన్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

తాజాగా ఈ సినిమా నుంచి ‘తను జతగా..’ పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ గుడప్పన్ బ్యూటిఫుల్ ట్యూన్ తో కంపోజ్ చేయగా.. శరత్ చంద్ర తిరునగరి డెప్త్ ఉన్న లిరిక్స్ రాశారు. కృష్ణ తేజస్వి ఆకట్టుకునేలా పాడారు. ‘తను జతగా లేని కథలో, ఈ ఒంటరి పరుగెక్కడికో, తను నేరుగ తాకే సడిలో, ఈ తుంటరి స్మృతులెక్కడివో..’ అంటూ ఎమోషనల్ లవ్ సాంగ్‌గా ఈ పాట సాగుతుంది.