calender_icon.png 20 March, 2025 | 1:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో..

20-03-2025 12:23:30 AM

తెలుగు సినీ ప్రియులకు బాగా దగ్గరైన హీరోయిన్స్‌లో కీర్తి సురేష్ ఒకరు. సౌత్‌లో పలు సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టులు చేసిన కీర్తి ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ అవకాశాలు దక్కించుకుంటోంది. ‘మహానటి’ చిత్రంతో ఆమెకు మంచి నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది. దానిని సద్వినియోగం చేసుకుంటోంది. ఇటీవల కీర్తి నటించిన ‘బేబీ జాన్’ చిత్రం విడుదలైంది కానీ ఆశించిన ఫలితమైతే రాలేదు.

అట్లీ నిర్మించిన ఈ చిత్రం నష్టాలను చవిచూసింది. ప్రస్తుతం కీర్తి ‘అక్క’ అనే చిత్రంలో నటిస్తోంది. రాధికా ఆప్టే, తను ఆజ్మి, దీప్తి సాల్విలతో కలిసి ఆమె కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం కీర్తి బాలీవుడ్‌లో కొత్త కోణాన్ని ఎక్స్‌ప్లోర్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటించేందుకు సిద్ధమవుతోందని టాక్.

ఇటీవలే దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయట. ఇక ప్రస్తుతం కీర్తి చేతిలో కొన్ని సౌత్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ‘బేబీజాన్’తో గ్లామర్ డోస్ పెంచిన కీర్తి.. ఇక ముందు రొమాంటిక్ కామెడీతో కొత్త కీర్తిని పరిచయం చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. మొత్తానికి పెళ్లి తర్వాత కెరీర్ పరంగా కీర్తి మరింత బిజీ కానుంది.