calender_icon.png 11 January, 2025 | 9:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడ్రన్ డ్రెస్‌లో.. తాళిబొట్టుతో..

20-12-2024 12:00:00 AM

కథానాయికలు వివాహం అయిన తర్వాత కనీసం ఒక నెల రోజుల పాటైనా సినిమాలకు, ప్రపంచానికి దూరంగా ఉంటారు. కానీ కీర్తి సురేష్ మాత్రం దీనికి చాలా భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. పెళ్లున మూడు రోజులకే ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొని ఆశ్చర్యపరిచారు. ఆమె నటించిన బాలీవుడ్ మూవీ ‘బేబీ జాన్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో వరుణ్ ధావన్, వామికా గబ్బి, జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్రలు పోషించారు. కలీస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తోంది. తాజాగా ముంబైలో జరిగిన ప్రమోషన్ ఈవెంట్‌కు కీర్తి సురేష్ మోడ్రన్ డ్రెస్‌లో మెడలో తాళిబొట్టుతో వచ్చేసింది. ఆమెను అలా చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. అటు వివాహ బంధానికి గౌరవాన్నిస్తూనే.. వృత్తి పట్ల నిబద్దతనూ కీర్తి సురేష్ ప్రదర్శిస్తోంది.