రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ‘బ్రహ్మాస్త్ర’లో ప్రేమికులుగా కనిపించి ఆకట్టుకున్నారు. ఆ చిత్రం తర్వాత మరోసారి ఈ ఇద్దరూ ‘లవ్ అండ్ వార్’ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోనూ రణ్‌బీర్, ఆలియా ప్రేమ జంటగానే కనిపించి మెప్పించనున్నారు. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విక్కీ కౌశల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇక ఈ చిత్రంతో అతిథి పాత్రలో దీపికా పదుకొణె నటించనుందని సమాచారం. ఈ వార్తతో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీపికకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువ. అంతే కాకుండా సంజయ్ లీలా భన్సాలీతో కలిసి ఆమె ఇప్పటికే మూడు సినిమాల్లో నటించింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన “రామ్ పద్మావత్, బాజీరావ్ మస్తానీ’ మూడు చిత్రాలు సంచలన విజయం సాధించాయి.
ఇప్పుడు దీపిక ‘లవ్ అండ్ వార్’ చిత్రంలోనూ మెరవనున్నారన్న వార్త సినిమాకు హైప్‌ను క్రియేట్ చేసింది. భావోద్వేగాలే కథాంశంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు దీపికయే స్పెషల్ అట్రాక్షన్ అని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.