calender_icon.png 3 April, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగ వాతావరణంలో

27-03-2025 01:46:43 AM

సన్న బియ్యం పంపిణీ చేయాలి

జిల్లా కలెక్టర్  తేజస్ నంద్ లాల్ పవార్ 

సూర్యాపేట, మార్చి26(విజయక్రాంతి): రేషన్ దుకాణాలకు మామిడి తోరణాలు,పూల దండలు కట్టి పండుగ వాతావరణంలో సన్నబియ్యం పంపిణి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్  తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి సన్న బియ్యం పంపిణిపై రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు.

ఈ  సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉగాది రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హుజూర్ నగర్ లో సన్న బియ్యం పంపిణి కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఏప్రియల్ 1 నుండి ప్రతి రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణి చేయాలని సూచించారు. రైతులు పండించిన పంట మిల్లులో మర ఆడించి సన్నబియ్యంను  పేదలకి పంపిణి చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు.  రేషన్ డీలర్లు కీలక పాత్ర పోషించి ఎలాంటి సమస్య లేకుండా పేదలకు బియ్యం పంపిణి చేయాలని ఏప్రియల్ 1 నుండి 15 వరకు  ఉదయం 8 నుండి 11 వరకు సాయంత్రం 5 నుండి 8 వరకు సమయపాలన పాటిస్తూ వందశాతం పంపిణి చేయాలని తెలిపారు.