09-04-2025 12:00:00 AM
ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): తలమడుగు మండలం ఖోడద్ జిల్లా పరిష త్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా మధ్యాహ్నం భోజనం, కిచెన్, స్టోర్ రూమ్‌లను పరిశీలించారు. మధ్యాహ్నం భోజనంలో నాణ్యత ప్రమాణా లు పాటిస్తున్నారా.. మెనూ ప్రకారం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ) ద్వారా అందిస్తున్న విద్యా బోధనను విద్యార్ధులు ఉపయోగించుకుంటున్నారా లేదా పరిశీలించారు. కలెక్టర్ కాసేపు టీచర్‌గా మరి విద్యార్థికి కూడికలు, తీసివేతలు ఎలా చేయా లో దగ్గరుండి బోధించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రాథమిక విద్యను బలోపేతం చేయుటకు 3, 4, 5 తరగతుల్లో వెనకబడిన విద్యార్థులకు బేసిక్ మ్యాథ్స్, ఇంగ్లీష్ నేర్చుకోవడంతో పాటు వారిలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఏఐ బోధన ఎంతో సహాకరిస్తుందన్నారు.
ఏఐ ఆధారిత విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, ఉపాధ్యాయులు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.