calender_icon.png 1 April, 2025 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో మెరుగుపడిన వైద్య ప్రమాణాలు

27-03-2025 12:48:50 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

నార్సింగి(మెదక్), మార్చి 26ఃజిల్లాలో వైద్య అధికారుల పనితీరు వల్ల వైద్య ప్రమాణాలు మెరుగయ్యాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొనియాడారు. బుధవారం  నార్సింగి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. దవాఖానలోని ఓపీ రిజిస్టర్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూరోగులకు అత్యుత్తమ, నాణ్యమైన వైద్య సేవలు అందించడం, ఆసుపత్రిలోని విభాగాల మెరుగైన నిర్వహణకు తార్కాణాలుగా పేర్కొన్నారు.

కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా అత్యాధునిక పరికరాలు, మౌలిక సదుపాయాలు, వసతులతో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నారని చెప్పారు.

జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా పర్వేక్షిస్తున్నామని, ఇన్ పేషెంట్ వసతుల విషయంలో బెడ్లు, బెడ్ షీట్లు, మరుగుదొడ్లు, మెరుగు పరుస్తున్నట్టు తెలిపారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం క్లస్టర్ వారీగా తీసుకుని హెడ్ క్వార్టర్ లో ఉండే మహిళలే కాకుండా సుదూర ప్రాంత మహిళలకు కూడా ఈ సదుపాయం అందే విధంగా చర్యలు చేపట్టామన్నారు.