02-04-2025 12:45:50 AM
నూతనంగా స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ బీ.సోనిని నియమించిన
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి, ఏప్రిల్ - 1(విజయక్రాంతి): మంథనిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మరింత మెరుగ్గా స్త్రీ వైద్య సేవలు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంథనిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ బి.సోని, స్త్రీ వైద్య నిపుణురాలని కాంట్రాక్టు ప్రాతిపదికన రిక్రూట్ చేశామని. ఇక ఆసుపత్రిలోని మహిళా రోగులకు ఇక నుంచి మరింత మెరుగ్గా వైద్య సేవలు అందించ బడుతాయని, గర్భిణీ స్త్రీలకు అవసరమైన రోగులు ఈ సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.