calender_icon.png 22 April, 2025 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధ్యానంతో మానసిక ఆరోగ్యం మెరుగు

19-04-2025 09:21:10 PM

కాటారం మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య..

కాటారం (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఆదర్శ హై స్కూల్ లో హార్ట్ పుల్ నెస్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడిటేషన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ శిబిరం లో కాటారం కు చెందిన మహిళలు పురుషులు, సీనియర్ సిటీజన్స్ పాల్గోని మెడిటేషన్ చేసారు. ఈ సందర్బంగా కాటారం మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య మాట్లాడుతూ... ధ్యానం చేయడం వలన ఒత్తిడిని తగ్గించుకోవచ్చునని అలాగే ధ్యానం వలన ప్రతి ఒక్కరు వారి భావోద్వేగాలను, మానసిక ఆరోగ్యన్ని మెరుగుపరచుకోవచ్చును అని అన్నారు.

ధ్యానం శిక్షణ కోసం ఏర్పాట్లు చేసిన  ఆదర్శ పాఠశాల చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, కరెస్పాండంట్ కార్తీక్ రావు కి హార్ట్ పుల్ నెస్ బృందం వారికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లో హార్ట్ ఫుల్ నెస్ ట్రైనర్స్ చెరుకుపల్లి రవీందర్, మాధవి, లక్ష్మణ్, జనగామ కరుణాకర్ రావు, కార్తీక్ రావు, రవీందర్ రావు, ఆత్మకూరి కుమార్, తిరుపతి, మల్లికార్జున్ వేణుగోపాల్, అశోక్, రాంనారాయణ, మహేష్, రాజు, ముస్కుల శ్రీలత రెడ్డి, సునీత, తిరుమల, లక్ష్మి, తేజ, శ్వేతా తదితరులు పాల్గొన్నారు.