మంచిర్యాల (విజయక్రాంతి): ప్రతి ఒక్కరు బుక్ రీడింగ్ ను అలవాటు చేసుకోవాలని, దీనితో నాలెడ్జి పెరుగుతుందని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సునీత అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం మంచిర్యాల పట్టణంలోని కాలేజ్ రోడ్ లో గల సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో బుక్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. లైబ్రరీలో పుస్తకాలను ప్రదర్శనగా పెట్టారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులు పుస్తక పఠనం, పేపర్ రీడింగ్ తదితర లాంటివి అలవాటు చేసుకోవాలని సూచించారు. గ్రంథాలయం గొప్పతనాన్ని, పుస్తకాలు చదవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.