28-02-2025 04:31:20 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): క్రీడలతో స్నేహబంధాలు మెరుగవుతాయని న్యాయవాది భజన సతీష్ కుమార్ తెలిపారు. మండల కేంద్రంలో తమ మిత్రుడు మణికంఠ జ్ఞాపకార్థంతో మొదటిసారిగా ఏర్పాటు చేసిన మణి మెమోరియల్ క్రికెట్ కప్ టోర్నీని శుక్రవారం ప్రారంభించారు. ముందుగా తమ మిత్రుడు మణికంఠ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... క్రీడలతో స్నేహ సంబంధాలు పెంపొందుతాయని తెలిపారు.
క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటాలని, క్రీడలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరకధార్యుడం పెంపొందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టోర్నీ దాతలు చేతుల శ్రీనివాస్ యాదవ్, గుండె వెంకన్న, గొనెల ప్రతాప్, అరవింద్, విన్నర్, రన్నర్ ట్రోఫీల దాత కన్నెబోయిన సారధి కుమార్, పలువురు పెద్దలు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, టోర్నీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.