- కొత్వాల్‌గూడలో ముస్తాబు చేస్తున్న హెచ్‌ఎండీఏ
- ఈనెల చివర్లో ప్రారంభానికి కసరత్తులు
రాజేంద్రనగర్, జనవరి 2: రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాల సరిహద్దు ప్రాంతంలో హెచ్‌ఎండీఏ భారీ స్థాయిలో అర్బన్ పార్కును ఏర్పాటు చేస్తోంది. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ పార్కులో అన్ని హంగులు, పర్యాటకులను విశేషంగా ఆకర్షించేలా అన్ని సౌకర్యాలను ఇక్కడ కల్పించనున్నారు.
ల్యాండ్ స్కేప్‌లు, టెర్రస్ గార్డెన్‌లు ఎంతో ముచ్చటగొలుపుతున్నాయి. అతి త్వరలో దీనిని ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలో ప్రారంభిం చనున్నట్లు హెచ్‌ఎండీఏ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఇటీవల అర్బన్ పార్కుకు సంబం ధించిన ఫొటోలను పంచుకుంది.
ఈనెల చివరిలో అర్బన్ పార్కును ప్రారంభించనున్నట్లు సమాచారం. కాగా ఈ పార్క్‌కు రాజేంద్రనగర్, శంషాబాద్ ఔటర్ రింగు రోడ్డు సర్వీస్ రోడ్డు నుంచి కూడా చేరుకోవచ్చు. దీంతోపాటు బండ్లగూడ జాగీర్ నుంచి కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. పార్కును త్వరగా ప్రాంభించాలని స్థానికులు కోరుతున్నారు.