calender_icon.png 26 February, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకట్టుకున్న స్టార్టప్ స్టాల్స్

26-02-2025 01:32:51 AM

ఉత్పత్తులను ప్రదర్శించిన 80 సంస్థలు 

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): బయోఆసియా2025 సదస్సులో డాక్టర్ రెడ్డీస్ వంటి ఫార్మా కంపెనీలతో హెల్త్ రంగంలో కొత్త ఆవిష్కరణలు చేసిన టీహబ్, ఐకేపీ ప్రైమ్, కేఐఐటీ వంటి 80 స్టార్టప్స్ తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. మొబిలాబ్ సంస్థ తక్కువ ధరలో బ్లడ్ టెస్టింగ్ కోసం స్మార్ట్ పోర్టబుల్ డయాగ్నిస్టిక్ సొల్యూషన్‌ను ఆవిష్కరించింది. సూట్ కేస్ మాదిరిగా ఈ పరికరం ద్వారా కేవలం 30 నిమిషాల్లో గుండె, లివర్, కిడ్నీకి సంబంధించిన రక్ష పరీక్షల ఫలితాలు తెలియనున్నాయి. ఈ కిట్ ధర కేవలం రూ. 18 మాత్రమే. ఈ కిట్ చార్జింగ్ ద్వారా నడుస్తుంది.  

అల్ట్రా సౌండ్ స్కానింగ్

డాక్టర్లు లేకుండానే అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేసే పద్ధతిని ప్లెబ్ సీ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆవిష్కరించింది. అల్ట్రా స్కానింగ్ కోసం కొన్ని అత్యవరస పరిస్థితుల్లో డాక్టర్ దూర ప్రాంతాల్లో ఉండి దీన్ని రోబోట్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. దీన్ని టెలీ రోబోటిక్ అల్ట్రాసౌండ్ అంటారని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 

‘ఫీజీ’ యాప్‌తో మజిల్ స్పాట్‌కు చెక్..

స్టార్టూన్‌ల్యాబ్స్ అనే సంస్థ  ఫిజియోథెరపీ చికిత్సలో నూతన విధానాన్ని ఆవిష్కరించింది. ఇందుకోసం ఫీజీ అనే యాప్‌ను రూపొందించింది. ఉదాహరణకు ఫిజియోథెరపీ కాలుకు చేయాలంటే.. ఏ ప్రదేశంలో చేయాలి? ఏ కండరానికి అది అవసరం? ఏ మోతాదులో చేయాలి? అనేది స్పష్టంగా చెబుతుంది. దీని ద్వారా డాక్టర్‌కు కూడా చికిత్స చేయడం సులువవుతుంది. ఫిజియోథెరపీలో ఈ విధానం ఇంతవరకు లేదని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. 

నోటి క్యాన్సర్ కోసం యాప్ 

నోటి క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించే ఏఐ బేస్డ్ స్క్రీన్ యాప్‌ను ఐహబ్  తీసుకొస్తోంది. దీని నమూనాను బయోఆసియా సదస్సులో ఐహబ్  ప్రతినిధులు ప్రదర్శించారు. ఇది అందుబాటులోకి వస్తే.. ప్రజలు నేరుగా తమ నోటి ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు ఉన్న లక్షణాల ఆధారంగా భవిష్యత్ నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? అనేది తెలుసుకోవచ్చు. 

మడిమ నొప్పికి మ్యాట్‌తో పరిష్కారం.. 

పిస్తార్ టెక్ అనే కంపెనీ మడిమ నొప్పిని తగ్గించే ‘మ్యాట్’ ను తయారు చేసింది. ఇందులో ఉండే సెన్సార్లు పాదాన్ని క్షణాల్లో పరిశీలించి.. సమస్య ఉన్న చోట మ్యాట్ ప్రెజర్‌ను అందిస్తుంది. దీంతో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ మ్యాట్‌ను  అనే దేశీయ కంపెనీ తయారు చేసింది.

పర్పుల్ కార్న్‌తో.. షుగర్ మెడిసిన్

నల్లగొండకు చెందిన ఇద్దరు యవకులు పర్పుల్ కార్న్‌తో ఆంతోసైన్ పదార్థాన్ని తీసి.. పసులు, మెంతులు నుంచి ప్రత్యేక పద్ధతిలో ఆయిల్ తయారు చేసి.. షుగర్ మెడిసిన్స్‌ను తయారు చేస్తున్నారు. దీని ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని నిర్వహాకులు చెప్పారు.