calender_icon.png 20 March, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సభలో ఆకట్టుకున్న స్టాళ్లు

17-03-2025 12:37:06 AM

జనగామ, మార్చి 16(విజయక్రాంతి): జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని శివునిపల్లిలో ఆదివారం జరిగిన సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభలో పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభించేందుకు సీఎం విచ్చేయగా.. సభా ప్రాంగణంలో ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ముందుగా ఈ స్టాళ్లను సందర్శించాకే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో పెంబర్తి హస్తకళలు, సిలికాన్ కాటన్ టెక్స్‌టైల్స్, ఆహార ఉత్పత్తులు, విజయ డెయిరీ స్టాళ్లతో పాటు జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఉద్యాన వన శాఖల స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో స్టాల్‌ను సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి ముడి సరుకుల సేకరణ, తయారీ, క్రయవిక్రయాల వివరాలను మహిళలను అడిగి తెలుసుకున్నారు.