calender_icon.png 10 March, 2025 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకట్టుకున్న సైన్స్ ఫేయిర్

10-03-2025 06:17:15 PM

మంచిర్యాల (విజయక్రాంతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, మంచిర్యాలలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సంయుక్తంగా నిర్వహించిన సైన్స్ ఫెయిర్ అందరిని ఆకట్టుకుంది. వివిధ సైన్స్ విభాగాల అధ్యాపకులు విద్యార్థుల చేత సైన్స్ మోడల్స్ తయారు చేయించి ప్రదర్శించారు. సైన్స్ ఫెయిర్ కు కాకతీయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జోన్-1 కోఆర్డినేటర్ వీర బ్రహ్మ కిషన్, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వైస్ ప్రెసిడెంట్, రిటైర్డ్ ప్రొఫెసర్ చెరుకుపల్లి సంజీవ రెడ్డిలు ప్రాజెక్టులను సందర్శించారు.

విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్, ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీ అనూష, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పీ సునీత, ప్రోగ్రాం కోఆర్డినేటర్ రిజ్వానా బేగం, అడిషనల్ కోఆర్డినేటర్ ఈ శైలజ, వివిధ విభాగాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ యూనిట్-1, యూనిట్-2 ప్రోగ్రాం ఆఫీసర్స్ జ్యోతి, రజిత విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.