calender_icon.png 3 March, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకట్టుకున్న సైన్స్ దినోత్సవం

01-03-2025 12:00:00 AM

రామాయంపేట/ చేగుంట, ఫిబ్రవరి 28: రామాయంపేటలోని మంజీరా విద్యాలయంలో సైన్స్ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక మండల విద్యాధకారి శ్రీనివాస్, జిల్లా సైన్స్ ఆఫీసర్ రాజిరెడ్డి సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నేటి బాలలలో ఎంతో విజ్ఞానం దాగి ఉందని వీరే రేపు కాబోయే శాస్త్రవేత్తలని తెలిపారు. తరగతి గదిలో చదువుకున్న విషయాలను నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగించాలో నేర్చుకుంటారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు 280 సైన్స్ ఎగ్జిబిట్లను ప్రదర్శించారు.

ఇందులో భాగంగా ఏఐ రోబో, చంద్రయాన్ 3 , చంద్రమండలం, ఎర్త్ క్వేక్ అలారం, ఫైర్ ఇంజన్, హైడ్రాలిక్ కార్ ,చేనేత పనివారు, బీడీ కార్మికులు దారమును చేతితో చుట్టడానికి బదులుగా హైడ్రాలిక్ మిషన్ ద్వారా చుట్టడం చూపరులను ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సురేష్ కుమార్, వాసవి పాఠశాల కరస్పాండెం ట్ జితేందర్ రెడ్డి, వాసవి ప్రిన్సిపల్ సురేష్ కుమార్, సుధాకర్, శ్రీశైలం, సాగరిక, రమ్య , శ్రీనీత, అనీల్ పాల్గొన్నారు.

చేగుంటలో...

చేగుంట మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా సైన్స్ డే నిర్వహించారు  ,చందాయిపేట్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్లను   ప్రధానోపాధ్యాయులుకిషన్ తనిఖీ చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి శాస్త్రవేత్తలని అన్నారు.

విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన  సైన్స్ ఎగ్జిబిట్లను పాఠశాలలో ప్రదర్శించారు. ఉపాధ్యాయులు దామోదర్, సౌజన్య, నర్సిములు, విఠల్ రెడ్డి, సిద్దిరాములు, స్వప్న, సలీం, శ్రీనివాస్, బంగారయ్యా, వీణ, రాములు, గిరిధర్, అజిత పాల్గొన్నారు.