calender_icon.png 1 April, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకట్టుకున్న మునిరంగ స్వామి నాటక ప్రదర్శన

29-03-2025 07:56:18 PM

విష్ణుమూర్తి పాత్రలో అలరించిన విజయక్రాంతి రిపోర్టర్ భీమయ్య..

రాజాపూర్: మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ ఆదిచింతల ముని రంగస్వామి స్టేజి నాటక ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంటుంది. శుక్రవారం రాత్రి నిర్వహించిన నాటక ప్రదర్శనలో విజయక్రాంతి రిపోర్టర్, తిరుమలాపూర్ గ్రామానికి చెందిన మలగల భీమయ్య విష్ణుమూర్తి, శంకరుడు నరసింహ, బ్రహ్మ ఆంజనేయులు, పార్వతి, సత్యం, భూదేవి జీ భీమయ్య, తిరుమల స్వామి, నల్లారెడ్డి ఎం.చంద్రయ్య మునిరంగా స్వామి గా పీ. చంద్రయ్య పాత్రలో పలువురుని అలరించారు. గ్రామీణ ప్రాంతాల్లో కనుమరుగవుతున్న నాటక ప్రదర్శనలను  తిరిగి పునర్జీవం పోసేందుకే ఈ నాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. రాజాపూర్ మండలంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ నాటక ప్రదర్శనను తిలకించారు.అంతరించి పోతున్న నాటకానికి జీవం పోసేందుకు ప్రతి గ్రామంలో నాటక రంగం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.