calender_icon.png 16 January, 2025 | 3:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకట్టుకునే ‘కుందనాల బొమ్మ’

10-08-2024 12:05:00 AM

చేతన్ కష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ధూం ధాం’. సాయికుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎస్ రామ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సాయి కిషోర్ మచ్చా తెరకెక్కిస్తున్నారు. వచ్చే నెలలో థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న  ఈ సినిమా నుంచి ఫోర్త్ సింగిల్ ‘కుందనాల బొమ్మ..’ను దర్శకుడు రాఘవేంద్రరావు విడుదల చేశారు. గోపీ సుందర్ కంపోజ్ చేసిన ఈ పాట సాహిత్యాన్ని రామజోగయ్యశాస్త్రి అందించగా, శ్రీకష్ణ పాడారు. ‘అందమైన కుందనాల బొమ్మరా.. అన్నమయ్య కీర్తనల్లే ఉందిరా.. పద్ధతైన పారిజాత పువ్వురా.. నేనంటే ఇష్టమంటోందిరా..’ అంటూ సాగుతున్న ఈ పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది.