13-03-2025 12:40:28 AM
రాకెట్ లాంచర్లు, శాటిలైట్ల పనితీరుపై అవగాహన
జనగామ, మార్చి 12(విజయక్రాంతి): అంతర్జాలంలో ఉండే రాకెట్ లాంచర్లు, శాటిలైట్ లాంచ్ వెహికల్స్‌పనితీరుపై విద్యార్థుల కు అవగాహన కల్పించారు. డీఆర్‌డీఎల్, డీఆర్‌డీవో, ఎన్‌ఎస్‌సీ, ఇస్రో సౌజన్యంతో కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్సీ ఆధ్వర్యంలో బుధవారం జనగామలోని గ్రీన్‌వుడ్ పాఠశాలలో క్షిపణుల డెమోలను ప్రద ర్శించి వాటి పనితీరును విద్యార్థులకు వివరించారు.
చందమామతో పాటు రాకెట్ లాంచర్ల డెమోలను ప్రదర్శించారు. రాకెట్ లాంచర్లు ఇండియన్ ఆర్మీలో అందిస్తున్న సేవలు, ఇస్రోలోని జీఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ శాటిలైట్ లాంచ్‌వెహికల్స్‌పై వివరిం చారు. చందమామపై పరిశోధనలు జరిపిన చంద్రయాన్3, చంద్రయాన్ 1, మంగల్యాన్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సైన్స్ అధికారి గౌసియా బేగం హాజరయ్యారు.
విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతాయ ని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ డీఎల్ బృంద సభ్యుడు గౌస్, కలాం యూత్ ఎక్సలెన్సీ జిల్లా కన్వీనర్ నర్సింగరావు, ప్రవీణ్, పాఠశాల కరస్పాండెంట్ మహ్మద్ సలావుద్దిన్, ఉపాధ్యాయుడు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.