calender_icon.png 14 December, 2024 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకట్టుకునేలా జూ పార్కుల అభివృద్ధి

14-12-2024 12:23:17 AM

  1. వరంగల్ పార్క్‌కు రెండు వైట్ టైగర్స్, సింహం
  2. సరస్వతీ పుష్కరాలకు ఏర్పాట్లు చేయండి 
  3. ఓపెన్ బర్నింగ్‌పై అవగాహన కల్పించాలి
  4. అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ 

హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): రాష్ర్టంలోని జూ, అర్బన్ ఫారెస్ట్ పార్కులను సం టదర్శకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.

సచివాలయంలో  శుక్రవారం జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (జపాట్) 13వ గవర్నింగ్ బాడీ సమావేశం, సరస్వతీ పుష్కరాల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా యానిమల్ అడాప్షన్ స్కీమ్ బ్రోచర్, డైరీ, కాఫీ టేబుల్ బుక్‌ను మంత్రి ఆవిష్కరించారు.

రాష్ర్టంలోని తొమ్మిది జూపార్కులతో పాటు, అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధికి చేపడుతున్న చర్యలను అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి సురేఖ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకుంటూనే.. సందర్శకులను ఆక ర్షించి ఆదాయాన్ని సమకూర్చేలా ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు.

ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్కుల్లో అమలవుతు న్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేయాలన్నారు. జంతువుల దత్తతపై అనుసరిస్తున్న విధివిధానాలపై ఆరా తీశారు. వృద్ధులు, చిన్నపిల్లల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పార్కు సిబ్బందికి  బీమా తప్పనిసరిగా చేయించాలని అధికారులను ఆదేశించారు.

మూడు నెలలకోసారి జపాట్ మీటింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని  సూచించారు. వరంగల్ కాకతీయ జూ పార్క్‌కు రెండు వైట్ టైగర్‌లు, సింహాన్ని తెప్పించేందుకు సెంట్రల్ జూ అథారిటీని సంప్రదించాలని మంత్రి సూచించారు. అదేవిధంగా సరస్వతీ నది పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించా రు.

పుష్కరాలకు తెలంగాణతో పాటు పక్క రాష్ట్రా ల భక్తులు కూడా వస్తారని, వారికి ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు. కాళేశ్వరంలో అంతర్వా హినిగా ప్రవహించే సరస్వతి నది పుష్కరాలు వచ్చే ఏడాది మేలో జరగనున్న నేపథ్యంలో నిర్వహణకు సంబంధించిన అంచనా నివేదికలను అధికారులు సిద్ధం చేయాలన్నారు.

12రోజుల పాటు ప్రతిరోజూ  సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ ఆర్‌ఎం డోబ్రియాల్ (హెవోఎఫ్‌ఎఫ్), చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఏలుసింగ్ మేరు, సీసీఎఫ్‌లు ప్రి యాంక వర్గీస్, భీమానాయక్, రామలింగం, జూ పార్క్స్ డైరెక్టర్ సునీల్ హేరామ త్, పశుసంవర్ధకశాఖ జేడీ కృష్ణమూర్తి, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్,  టూరిజం కార్పొరేషన్ ఎండీ ప్రకాశ్‌రెడ్డి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్, కాళేశ్వరం ఆలయ ఈవో మారుతి తదితరులు పాల్గొన్నారు.

 గ్యాస్‌ను వినియోగించాలి

ఓపెన్ బర్నింగ్ వల్ల గాలి నాణ్యత క్షీణిస్తుందని మంత్రి సురేఖ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల నెలకొల్పిన పరిశ్రమలు ఇంధనంగా బొగ్గుకు బదులు గ్యాస్‌ను వినియోగించేలా చర్య లు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు.

కా లుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటూ తెలంగాణను ఆరోగ్య రాష్ర్టంగా తీర్చిదిద్దాలన్నారు. ఓపెన్ బర్నింగ్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. హైదరాబాద్, పటాన్‌చెరు, నల్గొండ, సంగారెడ్డిలో కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు.

సమావేశంలో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి  అహ్మద్ నదీమ్, టీజీ పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి, సీఈఈ రఘు, జేసీఈఎస్ సత్యనారాయణ, ఎస్‌ఈ ఎస్‌డీ ప్రసాద్, ట్రాఫిక్ జా యింట్ సీపీ జోయల్ డేవి స్, ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్, నల్గొండ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, సీ డీఎంఏ జాయింట్ డైరక్టర్ సంధ్య, టీజీఈఆర్ టీసీఈసీ మునిశేఖర్, అగ్రికల్చ ర్ జేడీ ఆశా కమారి, సీఈ టీఎస్‌ఐఐసీ శ్యామ్ సుందర్, సీఈ హెఎండీఎ రవీందర్ పాల్గొన్నారు.