శేరిలింగంపల్లి, నవంబర్ 16 (విజయక్రాంతి): మాదాపూర్లోని శిల్పారామంలో వారాంతపు సంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన కథక్, కూచిపూడి నృత్య ప్రదర్శనలు అలరించాయి. సంజుక్త ఘోష్ శిష్యబృందం కథక్ ప్రదర్శన ఆకట్టుకుంది. కథక్ నృత్యంలో గురువందన, శివస్తోత్రం, శివతాండవం, జయంతి దేవి, చాముండి అం శాలను ఆరాత్రిక, శ్రియ, యశస్వి, రిథమ్, నిషిక, వందన, శుభశ్రీ, శతా బ్ది మొదలైన వారు ప్రదర్శించారు.
కూచిపూడి నాట్య గురువు బగ్గు ప్రవీణ్ శిష్యబృందం తాండవ నృత్యకారి, జతిస్వరం, రామాయణ శబ్దం, మరకత, మండూక శబ్దం, దశావతార శబ్దం, హిందువుల తిల్లాన మొదలైన అంశాలను అతిధి, తార, కేయ, వేహ, రిష్వ, శ్రీద, కృతి, పూర్వి, ఈషా, దీక్ష మొదలైన వారు ప్రదర్శించి చూపరులను మెప్పించారు.