calender_icon.png 4 April, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకట్టుకున్న క్రాఫ్ట్స్‌మేళా

17-12-2024 01:35:45 AM

శేరిలింగంపల్లి, డిసెంబర్ 16: శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాలో భాగంగా సోమవారం నిర్వహించిన చేనేత హస్తకళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శ్రీకాళహస్తి చెక్క విగ్రహాలు, జ్యూట్ బ్యాగ్‌లు, మట్టి పాత్రలతో పాటు, కశ్మీరీ శాలువాలు, కాటన్ అద్దకం చీరలు, కొటాడోరియా, పోచంపల్లి, వెంకటగిరి చీరలు మొదలైనవి శిల్పారామం బజార్‌లో ఉంచారు. అనంతరం అనూష శ్రీనివాస్ శిష్య బృందం చేపట్టిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.