22-03-2025 01:03:34 AM
కరీంనగర్, మార్చి 21 (విజయ క్రాంతి): నగరంలోని వావిలాలపల్లిలో గల అల్ఫోర్స్ మైదానంలో ‘ఫ్లిక్కర్‘ పేరుతో శుక్రవారం నిర్వహించినటువంటి భగత్ నగర్ అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులుగా హాజరైన ఎస్ ఆర్ ఆర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ బి. మధుసుధన్ రెడ్డి, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డిలు హాజరై వేడుకను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు కళల వైభవాన్ని విశ్లేషించి చెప్పాలని తద్వారా వారికి కళల పట్ల ఆసక్తి పెరుగుతుందని అన్నారు. వార్షిక ప్రణాళికల్లో భాగంగా నిర్వహించిన పలు పరీక్షలలో, ప్రతిభపాటవ పోటీలలో అద్భుత ప్రదర్శన కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.