హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6 (విజయక్రాంతి): ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈనెల 8న హుస్సేన్‌సాగర్ వద్ద నిర్వహించనున్న ఏయిర్ షోకు సంబంధించి శుక్రవారం సాయంత్రం ఏయిర్ ఫోర్స్ సిబ్బంది నిర్వహించిన రిహార్సల్స్ నగర ప్రజలను కనువిందు చేశాయి. మొత్తం 9 విమానాలతో చేపట్టిన ఈ రిహార్సల్స్.. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు, లిబర్టీ, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్ తదితర ప్రాంతాల మీదుగా కొనసాగాయి. విమనాలు ఒకే లేన్‌లో వెళ్లడం, వెనుకాల పొగతో కూడిన రహదారి వేసినట్టుగా ఉండటం నగరవాసులను కనువిందు చేసింది. దీంతో ఆదివారం నిర్వహించనున్న ప్రదర్శనపై నగర ప్రజల్లో విపరీతమైన హైప్ నెలకొంది.