calender_icon.png 30 October, 2024 | 2:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనపై గాంధీ భవన్‌లో సమావేశం

30-10-2024 11:13:25 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణనపై ప్రత్యేక సమావేశం బుధవారం గాంధీభవన్ లో జరుగనుంది. ఇవాళ గాంధీభవన్ లో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. నవంబర్ 6 నుంచి రాష్ట్రంలో బీసీ కులగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. సమగ్రంగా కుల గణనపై చర్చించి  పార్టీపరంగా కార్యాచరణ తీసుకోవాలని నిర్ణయం తీసుకోనుట్లు సమాచారం. ఈ కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.