న్యూఢిల్లీ, జూలై 23: 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, హ్యాండ్‌సెట్‌ల తయారీకి ఉపయోగించే కొన్ని భాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. గత ఆరేళ్లలో దేశీయ ఉత్పత్తిలో మూడు రెట్లు పెరుగుదల, మొబైల్ ఫోన్ల ఎగుమతులు దాదాపు 100 రెట్లు పెరగడంతో భారతీయ మొబైల్ ఫోన్ పరిశ్రమ అభివృద్ధి చెందిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా మొబైల్ ఫోన్, మొబైల్ పీసీబీఏ(ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు అసెంబ్లీ), ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ(బీసీడీ)ని 15 శాతానికి తగ్గించాలని ప్రతిపాది స్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
ఈ చర్యలతో ప్రపంచ మార్కెట్‌లో భారతదేశ ఎగుమతి పోటీతత్వం పెరు గుతుందని మొబైల్ ఫోన్ పరిశ్రమ ఇండియన్ సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసి యేషన్(ఐసీఈఏ) తెలిపింది. మొబైల్ ఫోన్లు, పీసీబీఏ, ఛార్జర్లకు సంబంధించి కస్ట మ్స్ డ్యూటీని 15 శాతానికి తగ్గించాలని తాము సిఫార్స్ చేశామని, అది ఆమోదించబడడం సంతోషంగా ఉందని ఐసీఈఏ చైర్మ న్ పంకజ్ మొహింద్రూ అన్నారు. ఈ ప్రకటనతో మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు ఊతం లభించినట్లయిందని తెలిపారు.