calender_icon.png 23 January, 2025 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ

23-01-2025 12:22:16 AM

వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ 

 వికారాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పతకాలు అంద జేయడమే ప్రభుత్వ లక్ష్యమని, సంక్షేమ పథకాలు అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగు తుందని జిల్లా   కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.  బుధవారం  వికారాబాద్ మున్సిపల్ పరిదిలో మద్గుల్ చిట్టెం పల్లి 8 వ వార్డు నందు ఏర్పాటు చేసిన ప్రజా పాలన వార్డు సభలో కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్‌తో కలిసి పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే రైతు భరోసా, ఇందరమ్మ ఆత్మీయ  భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అయిన  సంక్షేమ పథకాలకు  అర్హుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న వార్డు సభలలో చదివి వినిపించిన జాబితాలో మీ పేర్లు లేకుంటే  మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని, వార్డ్ సభలో ప్రదర్శనలో ఉంచిన జాబితాలో పేర్లలను ఒకసారి చూసుకొని ఏవైన అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

  ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికే కాకుండా, ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు కూడా ఇప్పుడు నిర్వహిస్తున్న వార్డు సభలలో దరఖాసు చేసుకోవచ్చని, ఇది నిరంతర ప్రక్రియ అని కలెక్టరు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్  మాట్లాడుతూ ఆరు  గ్యారంటీ లలో భాగంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి  రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు  పథకాలు అందుతాయని అన్నారు.

జాబితా లో పేర్లు  లేనివారు నిరాశ పడకుండా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఈ వార్డు సభలో మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, ఫ్లోర్ లీడర్ సుధాకర్  రెడ్డి, ప్రజా ప్రతినిధులు, వార్డు ప్రజలు, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.

గురుకులాల్లో మౌలిక వసతులు కల్పించాలి 

 గురుకులంలో అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు.   బుధవారం దౌల్తాబాద్  మండలంలో  కెజిబివి బాలికల గురుకుల పాఠశాలను  జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా  గురుకుల పాఠశాల పరిసరాలను, వంట గదులను, వంట సామాగ్రిని,బియ్యం ను, డా ర్మెంటరీ రూమ్ లను కలెక్టర్ పరిశీలించారు.

ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అధికారులకు సూచించారు.  జిల్లా కలెక్టర్‌తోపాటు కడ అధికారి వెంకట్ రెడ్డి, తహసిల్దార్ గాయత్రి, ఎస్‌ఐ రవి గౌడ్, ఇంచార్జి  ప్రిన్సిపల్ బసమ్మ, ఏంపిడిఓ శ్రీనివాస్,  సుదర్శన్ విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు.