నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ జనవరి 22 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డుతోపాటు పెద్దాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు.అర్హులైన వారందరూ గ్రామసభ ద్వారా దరఖాస్తులు స్వీకరించి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రజలు వినతులు ఇచ్చే క్రమంలో ఆధార్ సెల్ నెంబర్ కుటుంబ సభ్యుల పేర్లతో సహా పూర్తి వివరాలు సమర్పించాలని అప్పుడే నమోదు ప్రక్రియ సజావుగా జరుగుతుందన్నారు. గ్రామసభలో ప్రజలకు తగిన వసతులు సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పెద్దాపూర్ ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసి హాజరు రిజిస్టర్ విద్యార్థుల మెనూ రిజిస్టర్ లను పరిశీలించారు.