calender_icon.png 16 April, 2025 | 3:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వేచ్ఛ.. సమానత్వం అంబేద్కర్ అభిమతం

15-04-2025 12:31:34 AM

రాజ్యాంగం దన్నుతోనే తెలంగాణ కల సాకారం

అంబేద్కర్ స్ఫూర్తితో సంక్షేమ పథకాల అమలు

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): స్వేచ్ఛ.. సమానత్వం భారత రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ అంబేద్కర్ అభిమతమని, అణగారిన వర్గాల సం క్షేమం, మహిళల సాధికారత కోసం జీవితకాలం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదా యకమని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్‌లోని ట్యాంక్ బం డ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో కలిసి సీఎం పూల మాల వేసి నివాళి అర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. అంబేద్కర్ లిఖించిన రాజ్యాంగం దన్నుతోనే తెలంగాణ కల సాకారమైందని కొనియాడారు.

అంబేద్కర్ స్ఫూర్తితో తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నదని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి నిర్ణయాలు తీసుకుని సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్నదని వివరించారు. అంబేద్కర్ పేరిట నాలెడ్జ్ సెంటర్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకంతో యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

రాజ్యాంగం మార్చేందుకు బీజేపీ కుట్రలు: డిప్యూటీ సీఎం భట్టి

దేశంలో రాజ్యాంగమే లేకుండా చేయాలని కేంద్రంలోని బీజేపీ కుట్రలు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా మార్చడమే బీజేపీ ధ్యేయమన్నారు. ‘భారత్ సంవిధాన్ బచావో’ పేరిట ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఉద్యమిస్తుంటే.. ఆయన్ను తిరోగమనవాది అని బీజేపీ నేతలు విమర్శించడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. దేశంలో కులగణన చేపట్టాలని, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తమ ప్రభుత్వం కోరుతున్నదన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో  కాంగ్రెస్ సంవిధాన్ బచావో కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.