calender_icon.png 13 January, 2025 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆడబిడ్డలకు అండగా పథకాలు అమలు

13-01-2025 01:58:50 AM

* బ్రాహ్మణపల్లిలో చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్

*  రూ. 18 లక్షల విలువగల చెక్కుల పంపిణీ 

పెద్దపల్లి, జనవరి 1౨: ఆడ బిడ్డలకు  అండగా ఉండాలని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నాడని రామగుండం ఎమ్మె ల్యే మక్కన్ సింగ్ అన్నారు. ఆదివారం అంత ర్గం మండలంలోని బ్రాహ్మణపల్లి రైతు వేదిక లో తహసీల్దార్  రవీందర్ పటేల్ ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మీ మరియు షాద్ ముబా రక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ సీఎం ప్రజల సంక్షే మం కోసం, ఆడబిడ్డలకు జన్మానించిన కుటుం బానికి అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో కల్యాణ లక్ష్మి, షాద్ ముబారక్ పథకాలు అమలు చేస్తున్నారని, మండలంలో రూ. 80 కోట్లతో డాంబర్ రోడ్లు వేస్తామని, బండల వాగు ప్రాజెక్టు నిర్మాణం చేస్తామని, గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి 10 సంవత్సరాలు కాలయాపన చేయడం జరిగిందని, కానీ మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఈ బండలవాగు ప్రాజెక్టును అతి త్వరలోనే రూ. 250 కోట్ల తో ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా బండల వాగు ప్రాజెక్టు నిర్మాణానికి  అంతర్గం మరియు పాలకుర్తి మండల రైతులకు సాగు నీరు ఇవ్వడానికి అతి త్వరలోనే ప్రారంభించడం జరుగుతుం దని, వచ్చే సంవత్సరంలో పాలకుర్తి రిజర్వాయర్‌ను కూడా రైతుల కోసం, వారి అభ్యున్నతికి కోసం ప్రారంభిస్తామ న్నారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవిందర్ పటేల్, మార్కెట్ వైస్- చైర్మన్ మడ్డి తిరుపతి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హనుమాన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కళ్యాణ్ లక్ష్మి లబ్ధిదారులు ఉన్నారు.