calender_icon.png 29 January, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పథకాల అమలు నిరంతర ప్రక్రియ

27-01-2025 12:00:00 AM

నల్లగొండ నోడల్ అధికారి అనితా రామచంద్రన్ 

నల్లగొండ, జనవరి 26 (విజయక్రాంతి) : రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని రాష్ర్ట మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి, జిల్లా నోడల్ అధికారి అనితా రామచంద్రన్ స్పష్టం చేశారు. ఆదివారం నల్లగొండ మండలం గుండ్లపల్లిలో నాలుగు పథకాలకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఆమె మంజూరు పత్రాలు అందజేశారు.

గణతంత్ర దినోత్సవం సందర్బంగా ప్రభుత్వం రాష్ర్టవ్యాప్తంగా నాలుగు పథకాల అమలు ప్రారంభించిందని వెల్లడించారు. గుండ్లపల్లిలో 115 మందికి ఇండ్లు ఇచ్చామని త్వరగా నిర్మించుకుంటే 6 నెలల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి గృహ ప్రవేశాలకు వస్తామన్నారు.

ఇక్కడ 90 మందికి రేషన్ కార్డులు, 12 మందికి ఇందిరమ్మ ఆత్మీయ, 652 మంది రైతులకు రైతుభరోసా అందించాయని తెలిపారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. అరులందరికీ విడతల వారీగా సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు. అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి  డీఆర్డీఏ శేఖర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ గౌడ్ హాజరయ్యారు.