calender_icon.png 10 January, 2025 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కిల్ వర్సిటీలో రిజర్వేషన్లు అమలు

02-08-2024 12:44:21 AM

గతంలో కొద్దిమంది కోసం యూనివర్సిటీలు ధారాదత్తం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  

హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): స్కిల్ వర్సిటీని ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో తీసుకొస్తున్నా సర్కారు వర్సిటీల మాదిరిగానే రిజర్వేషన్లు అమలు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గురువారం స్కిల్ వర్సిటీ బిల్లుపై ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. గత ప్రభు త్వం కొన్ని వర్సిటీలను తీసుకొచ్చిందని.. కానీ, వాటిలో ఎక్కడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు వాటిలో ఎక్కడా అవకాశం లేదని ఆరోపించారు. కొందరు ప్రైవేటు వ్యక్తులతో కోసం వర్సిటీలను ధారాత్తం చేశారని మండిపడ్డారు. కానీ, తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు ఉపయోగపడేలా స్కిల్ వర్సిటీ బిల్లు ను తీసుకొచ్చినట్టు వెల్లడించారు.

అన్ని అంశా లు పొందుపరిచి బిల్లును ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. రిజర్వేషన్లతోపాటు విద్యా ర్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందని స్పష్టంచేశారు. రీయింబర్స్‌మెంట్ కింద కవర్ కానీ విద్యార్థులకు ఫీజు తగ్గించే అంశాన్ని ఆలోచిస్తున్నామని తెలిపారు. గవర్నింగ్ బాడి లో ఎస్సీ, ఎస్టీలకు కాకుండా ఓబీసీలు మైనారిటీలకు అవకాశం ఇవ్వాలని ఎంఐఎం సభ్యు లు కోరగా.. భట్టి సానుకూలంగా స్పందించా రు. గొప్ప ఆశయంతో ముందుకు తీసుకొచ్చి న స్కిల్ వర్సిటీ బిల్లును అందరూ సంతోషం గా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ర్టంలోని నిరుద్యోగ యువత  ఉపాధి పొందడా నికి ఈ వర్సిటీ గొప్ప అవకాశం అన్నారు. సీఎం రేవంత్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, క్యాబినెట్ మొత్తం యువత కోసం దీన్ని తీసుకొస్తున్నట్టు స్పష్టం చేశారు.