ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి
మేడ్చల్, జనవరి 16(విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 నుంచి 4 సంక్షేమ పథకాలను అమలు చేయనుందని ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం మేడ్చల్ పట్టణంలో 44 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకేసారి నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేయడం చెప్పుకోదగిన విషయం అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పథకాలను అమలు చేస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి అన్నారు.
38 కోట్లతో అమృత్ పథకం కింద ఐదు మంచినీటి ట్యాంకులు, 25 లక్షలతో చేపట్టిన తుమ్మ చెరువు కంచెను, ఆరు కోట్లతో సీసీ రోడ్లు, యు జి డి పనులు ప్రారంభించారు. మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపిక నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు హరి వర్ధన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ వజ్రేస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు వేముల శ్రీనివాసరెడ్డి, గౌరవెల్లి రమణారెడ్డి, భాస్కర్ యాదవ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.