calender_icon.png 31 March, 2025 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిల్లుల అమలు ప్రజాపాలనకు నిదర్శనం

20-03-2025 12:15:38 AM

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

మెదక్, మార్చి 19(విజయక్రాంతి): ఎన్నో ఏండ్లుగా నలుగుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా.. బీసీలకు రాజకీయ, ఉద్యోగ, విద్య, ఆర్థిక రంగాలలో 42 శాతానికి రిజర్వేషన్ల పెంపు బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదింపజేయడం చారిత్రాత్మకమని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ రెండు బిల్లులు ఆమోదంలో సహకరించిన ప్రతి ఒక్కరికి యావత్ తెలంగాణ ప్రజానీకం రుణపడి ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ పవన్, గూడూరి ఆంజనేయులు, న్యాయవాది జీవన్ రావు, రామాయంపేట మండల నాయకులు సుప్రబాత్ రావు, యాదగిరి, రమేశ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గోవింద్ నాయక్, చిన్నశంకరంపేట మండల నాయకులు రాజిరెడ్డి, సాన సత్యనారాయణ, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, శంకర్, సిద్దయ్య, యువజన జిల్లా అధ్యక్షులు పరుశురాం గౌడ్, మెదక్ పట్టణ మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ...కళ్యాణ లక్ష్మి చెక్కులు పేదింటి ఆడబిడ్డలకు వరంలాంటిదని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. బుధవారం హావేళిఘణపురం మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్స్‌లో కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్, సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్దిదారులకుఅందజేశారు.