కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఎన్నికల ముందు పేద ప్రజల కోసం ప్రకటించిన అనేక సంక్షేమ పథకా లను అమలు చేయాల్సి ఉంది. ముఖ్యంగా రేషన్ కార్డులు ఇవ్వకుండా గత 7 8 సంవత్సరాల నుండి తా త్సారం చేయడం జరుగుతున్నది. అనేక గ్రామాల్లో, పట్టణాలలో పేదలు సొంత గృహాలు లేక, ఉపాధి ఉద్యోగాలు లభించక, ఇంటి అద్దెలు భరించలేక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టా డుతున్నారు.
ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్లు పెద్ద మొత్తంలో నిర్మించి, యుద్ధప్రాతిపదికన ఈ సమస్యను పరిష్కరించాలి. 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రేషన్ కార్డులు ఇవ్వకుండా అనేక లక్షల కుటుంబాల వారు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం అనేక మార్లు వాయిదాలు వేస్తూ తొమ్మిది సంవత్సరాలు గడిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవ త్సరం పూర్తయి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగానైనా అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వాలి.
గత నాలుగు సంవత్సరాల నుంచి భర్తలు చనిపోయిన మహిళలకు పింఛన్లు ఇవ్వలేదు. కుటుంబ యజమాని అకాల మరణం చెంది కుటుంబసభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ గత ప్రభుత్వం వారి సమస్యలను పెడ చెవిన పెట్టింది. ఇంకా నిర్లక్ష్యం చేయకుండా వితంతు పింఛన్లు మంజూరు చేయవలసిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాలి. వృద్ధులకు 2,000 రూపాయల పింఛన్లు ఏ మాత్రం సరిపోవటం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రతి నెల 4,000 రూపాయల పింఛన్ ఇస్తామని 2023 నవంబర్ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది.
ఇప్పుడు వస్తున్న 2,000 రూపాయల పింఛను కేవలం వృద్ధుల ఆరోగ్య సమస్యలకు సంబంధించిన మందులు కొనుక్కోవడానికి కూడా సరిపోవడం లేదు. ఇక, ఆహారం, ఇతర అవసరాలకు వృ ద్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అనేక సందర్భాల్లో తమ పిల్లలు పట్టించుకోకపోవడం పింఛను పెంచకపోవడం వల్ల వృద్ధులు తీవ్ర ఆం దోళనకు గురవుతున్నారు. వృద్ధులు ఎలాంటి నిరసనలు, ఆందోళనలు కూడా చేయలేరు.
ప్ర భుత్వమే స్పందించి తాము ప్రకటించిన 4 వేల పింఛను వెంటనే మంజూరు చేయవలసిన అవసరాన్ని గుర్తించాలి. విద్యావంతులైన యువ కులు గత 20 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లభించక జూనియర్ డిగ్రీ కళాశాలలు ప్రారంభించుకున్న విషయం నాయకులకు తెలిసిందే కదా. రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేసి ఈ కళాశాలల పరిపు ష్టికి పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎంతో కృషి జరిగింది.
కొత్త ప్రభుత్వంపైనే కొండంత బాధ్యత
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసి 4,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు మిగిల్చిపోయింది. పేద విద్యార్థులు చదువుతున్న అనేక డిగ్రీ, జూనియర్ కళాశాలలో ఫీజు బకాయిలు రాకపోవడం వల్ల అనేకమంది యజమానులు అప్పుల పాలై కళాశాలు మూసివేసే దిశకు చేరుకున్నారు. పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించి చదివే శక్తి లేకపోవడాన్ని ప్రభుత్వం గుర్తించాలి.
కళాశాల యజమానులు కూడా తల్లిదండ్రులను, విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న విషయమూ ప్రభు త్వం గుర్తెరగాలి. ఈ కళాశాలలన్నింటికీ రావలసిన బకాయిలను చెల్లించి పేద విద్యార్థులకు తగిన న్యాయం చేయవలసిన అవసరం ఉంది.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వేలాదిమంది యువకులు, విద్యావంతులు అనేక త్యాగాలు చేసి గత పది సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లేకుండా అవమానాలను భరిస్తున్నారు. ఆ ప్రభుత్వాన్ని ఓడించి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కోసం వారు ఎదురుచూస్తున్నారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసింది కేవలం పేద, బడుగు, బలహీన వర్గాల యువతీ యువకులే. అర్హులైన ఉద్యమకారులను గుర్తించి తగిన న్యాయం చేయవలసిన అవసరాన్ని కూడా ఈ ప్రభుత్వం పరిశీలించాలి. ప్రస్తుత ప్రభుత్వం అమలు పరుస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలతోపాటు పేద ప్రజల కోసం ప్రకటించిన సంక్షేమ పథకాలను కూడా వెంటనే అమలుపరచాలి.
-ప్రొ.కూరపాటి వెంకట్ నారాయణ