* భారత్ ప్రమేయముందని ఆరోపణలు
* వాషింగ్టన్ పోస్ట్‌లో కథనాలు
మాలె, డిసెంబర్ 31: మాల్దీవుల అధ్యక్షు డు మహమ్మద్ మయిజ్జు అభిశంసనకు ప్రతిపక్షాలు కుట్ర చేసినట్లు అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ సోమవారం ‘డెమోక్రటిక్ రిన్యూవల్ ఇన్షియేటివ్’ పేరుతో ఓ అంతర్గత కథనాన్ని ప్రచురించింది.
మయిజ్జును తొలగించేందుకు భారత్ గూఢచార సంస్థ (రా)కు చెందిన ఓ ఏజెంట్ మాల్దీవుల ప్రతిపక్ష నేతలతో సంప్రదింపులు జరుపుతు న్నట్లు ఆరోపించి ంది. మయిజ్జు సొం త పార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ సభ్యు లతో సహ 40 మంది పార్లమెంట్ సభ్యులకు లంచం ఇవ్వాలని మాల్దీవుల ప్రతిపక్ష నాయకులు ప్రతిపా దించారని తెలిపింది.
సహాయం చేయాల్సిందిగా భారతదేశం నుంచి 6 మిలియన్ డాల ర్లను కోరినట్లు ఆ కథనంలో పేర్కొన్నది.
వాషింగ్టన్ కథనమిదే..
మయిజ్జుపై అభిశంసనకు అనుకూలంగా ఓటు వేయడానికి మాల్దీవుల పార్ల మెంట్‌లోని 40 మంది సభ్యులకు లంచం ఇవ్వడానికి మాల్దీవుల ప్రతిపక్షం ప్రతిపాదించిందని, ఇందుకు కావాల్సిన డబ్బు భారత్ నుంచి రాబోతుందని వాషింగ్టన్ పోస్ట్ సోమవారం ఓ కథనాన్ని ప్రచురించింది.
మయిజ్జును అభిశంసించడానికి భారత్‌నుంచి 6 మిలియన్ డాలర్లను ప్రతిపక్షం కోరిందని తెలిపింది. వాషింగ్టన్ పోస్ట్ ఆరోపణలను మాజీ అధ్యక్షుడు నషీ ద్ తోసిపుచ్చారు. అయితే వాషింగ్టన్ పోస్ట్ చేసిన ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ స్పందించలేదు.