calender_icon.png 12 October, 2024 | 2:49 PM

సమన్వయంతో ముందుకు వెళుతున్నాం

03-09-2024 12:01:15 PM

కరింనగర్,(విజయక్రాంతి):  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో టిజి ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ కు నోడల్ ఆఫీసర్ రాజు చౌహాన్ నియమించారు. విద్యుత్ సరఫరాపై నిత్యం పర్యవేక్షణ చేస్తూ క్షేతస్థాయిలో సంబంధిత సిబ్బంది, అధికారులతో సమన్వయము చేసుకుంటూ విద్యుత్ పున్నరుద్ధరణ పనులు వేగవంతం చేస్తున్నారని సూపెరింటెండింగ్ ఇంజనీర్ వడ్లకొండ గంగాధర్ తెలిపారు. చెట్లు విరిగి స్థంభాలపై పడటంతో  31 పోల్ లు, 3 ట్రాన్స్ ఫార్మర్లు, ఇన్సులేటర్లు దెబ్బతిన్నాయన్నారు. వరదల వల్ల నీట మునిగిన సబ్ స్టేషన్లు, పిడుగులు పడి దెబ్బతిన్న చోట మరమ్మతులు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ విద్యుత్తును సరఫరా అందిస్తున్నామని అన్నారు. భారీ వర్షాలతో రూ.18,65,000 నష్టం వాటిల్లిందన్నారు. విద్యుత్ సామాగ్రి సరిపడా అందుబాటులో ఉందని, 24/7 క్షేత  స్థాయిలో  విద్యుత్ సిబ్బంది, అధికారులు అందరు అందుబాటులో ఉన్నారని అన్నారు.

ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ సూచనలను పాటిస్తూ విద్యుత్ సరఫరాను మానిటర్ చేస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడిన వెంటనే మా సిబ్బంది పున్నరుద్దరించేసేందుకు సిద్ధంగా ఉన్నారని, కుండపోతగా కురుస్తున్న వర్షంలో అర్థరాత్రి అని సైతం లెక్కచేయకుండా క్షేత  స్థాయిలో పనిచేసే మా సిబ్బంది విద్యుత్ అంతరాయం ఏర్పడిన వెంటనే పున్నరుద్దరించారని ఈ సందర్భాంగా వారిని అభినందిస్తున్నామన్నారు. వినియోగదారులు విద్యుత్ పట్ల జాగ్రత్త వహించాలని , విద్యుత్ స్తంభాలు,  ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డు లను తడి చేతులతో ముట్టుకోరాద్దన్నారు . స్వీయ నియంత్రణ ముఖ్యమని ఎట్టి పరిస్థితుల్లో స్వయంగా విద్యుత్ మరమ్మతులు చేప్పట్టరాదని కోరారు. విద్యుత్ అంతరాయం, మరే  ఇతర  సమస్యలు ఉన్న ఎడల  వినియోగదారులు  ఈ   నెం. 9440811444.  లేదా   టోల్ ఫ్రీ నెం. 1912, 18004250028  కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు . ఈ కార్యక్రమంలో డి ఈ చంద్రమౌళి ఏడీలు అంజయ్య ప్రదీప్ కుమార్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు