calender_icon.png 12 April, 2025 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారులకు వ్యాధి నిరోధక టీకా తప్పనిసరి

03-04-2025 12:00:00 AM

ముషీరాబాద్ యూపీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ మనోజ్ రెడ్డి

ముషీరాబాద్, ఏప్రిల్ 2: (విజయక్రాంతి) : పుట్టిన బిడ్డ నుంచి మొదలుకొని ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు తప్పనిసరిగా వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలని ముషీరాబాద్ ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యుపిహెచ్సి) వైద్యాధికారి డాక్టర్ మనోజ్ రెడ్డి అన్నారు.

ఈ మేరకు బుధవారం ముషీరాబాద్ (యూపీహెచ్సీ) లో ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు12 ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించే  టీకాలను ఉచితంగా వేశారు. ఈ సందర్భం గా  డాక్టర్ మనోజ్ రెడ్డి మాట్లాడుతూ చిన్నారులను వ్యాధుల నుంచి రక్షించేందుకు తప్ప నిసరిగా విద్యార్థులకు టీకాలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దవాఖాన పీహెచ్‌ఎన్ ఫెల్లిన్, విజయ  కుమారి, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.