calender_icon.png 19 April, 2025 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇమ్మిగ్రేషన్ పత్రాలు వెంట ఉండాల్సిందే

13-04-2025 12:43:55 AM

* అమెరికాయేతర పౌరులకు డీహెచ్‌ఎస్ ఆదేశాలు

* హెచ్ వీసాదారులతోపాటు గ్రీన్‌కార్డుదారులకూ వర్తింపు

వాషింగ్టన్, ఏప్రిల్ 12: ఇమ్మిగ్రేషన్ పత్రాల విషయంలో యూఎస్ డిపార్ట్‌మెం ట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్) కీలక ప్రకటన చేసింది. 18 ఏళ్లు నిండిన అమెరికాయేతర పౌరులు ఎల్లప్పుడూ తమ వెంట చెల్లుబాటు అయ్యే ఇమ్మిగ్రేషన్ పత్రాలను కలిగి ఉండాలని తేల్చి చెప్పింది.

చట్టబద్ధంగా అమెరికాలో శాశ్వత నివాస అర్హత కలిగిన వారితోపాటు హెచ్ స్టూడెంట్ వీసాదారులతోపాటు గ్రీన్‌కార్డు హోల్డర్లకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయనిడీహెచ్‌ఎస్ స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే ఎటువంటి గ్రేస్ పీరియడ్ ఇవ్వబోమని వెల్లడించింది. అలాగే, ఎవరైనా 14 ఏళ్లలోపు పిల్లలను కలిగి ఉంటే వారి నమోదు ప్రక్రియను మరోసారి పూర్తి చేయాలని పేర్కొంది. అంతేకాకుండా వాళ్లకు సంబంధించిన ఫింగర్ ప్రింట్‌లను పంపవలసి ఉంటుందని చెప్పింది.