18-02-2025 11:28:28 PM
భారత్, మధ్య ఆసియాలకు చెందిన వ్యక్తులను కోస్టారికాకు తరలిస్తున్న అగ్రరాజ్యం..
వాషింగ్టన్: అగ్రరాజ్యంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని ఆ దేశం బలవంతంగా పంపుతున్న విషయం తెలిసిందే. భారత్‌కు చెందిన అక్రమవలసదారులతో ఇప్పటికే మూడు అమెరికా ఆర్మీ విమానాలు అమృత్‌సర్ చేరుకున్నాయి. ప్రస్తుతం అమెరికా మరో విధంగా ఆలోచిస్తోంది. భారత్, మధ్య ఆసియాకు చెందిన పలువురు అక్రమ వలసదారులను కోస్టారికా పంపిస్తుంది. ఇందుకు కోస్టారికా దేశంతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
ఈ ఒప్పందంపై కోస్టారికా అధ్యక్ష కార్యాలయం స్పందిస్తూ.. ‘అవును నిజమే ఇప్పటికే 200 మంది వలసదారులతో ఓ విమానం మా దేశానికి బయలుదేరింది.’ అని తెలిపింది. ఈ ప్రక్రియకు కావాల్సిన సొమ్మును అమెరికానే భరించడం గమనార్హం. ఇటువంటి ఒప్పందాలనే గ్వాటమాల, పనామా దేశాలతో కూడా అగ్రరాజ్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పనామాకు కొంత మంది వలసదారులను అగ్రరాజ్యం పంపించింది. గ్వాటమాలకు మాత్రం ఇంకా ఎవర్నీ తరలించలేదు.