calender_icon.png 19 May, 2025 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వలసదారులే ఆర్థిక వ్యవస్థకు బలం

03-05-2024 12:39:00 AM

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యలు

భారత్, చైనా వలసదారులను ద్వేషిస్తున్నాయని కామెంట్

న్యూయార్క్, మే2: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వలసదారులపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడటంలో వలసదారులది కీలక పాత్ర అని కొనియాడారు. అయితే, అభివృద్ధి చెందుతున్న భారత్, చైనా, జపాన్ వంటి దేశాలు వలసదారులను ద్వేషిస్తున్నాయని, అందుకే ఆయా దేశాల ఆర్థిక వృద్ధి నెమ్మదించిందని పేర్కొన్నారు. గురువారం ఎన్నికల ప్రచార నిధుల సేకరణపై వాషింగ్టన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.