- 25 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు
- మీడియాతో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): గణేశ్ నిమజ్జనాలకు పటి ష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. నిమజ్జనం ఏర్పాట్లపై శుక్రవారం సీపీ మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈసారి ట్యాంక్‌బండ్‌పై గణేశ్ నిమజ్జనం ఉండదని తెలిపారు. నిమజ్జనం కోసం నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌లో ప్రత్యేక ఏర్పా ట్లు జరుగుతున్నట్లు చెప్పారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుం డా 25 వేల మంది పోలీసులతో భారీ బం దోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర 17న ఉద యం 6:30 గంటలకు ప్రారంభమై, మధ్యా హ్నం 1:30లోపు నిమజ్జనం పూర్తవుతుందని తెలిపారు. అన్ని రకాల విగ్రహాలు కలిపి సుమా రు లక్ష వరకు ఉంటాయని సీపీ పేర్కొన్నా రు. 17న పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహా లు నిమజ్జనం అవుతాయని వెల్లడించారు.
పోలీసుల నిబంధనలు..
గణేశ్ నిమజ్జన శోభాయాత్రల నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసులు కీలక నిబంధనలు జారీ చేశారు. సౌత్ జోన్ పరిధిలో నుంచి విగ్రహాలను తీసుకెళ్లేవారు ముందుగానే బయలుదేరాలని, వాహనానికి పోలీసులు కేటాయించిన నంబర్‌ను ప్రదర్శించాలని తెలిపారు. విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనానికి లౌడ్ స్పీకర్ అమర్చకూడదని, డీజేతో కూడిన మ్యూజికల్ సిస్టమ్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంలో మద్యం సేవించిన వ్యక్తులకు అనుమతి ఉండదని, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించకూడదని సూచించారు.
ఊరేగింపులో ఎవరూ కర్రలు, కత్తులు, ఆయుధాలు, మండే పదార్థాలు తీసుకెళ్లకూడదని, జెండాలు లేదా అలంకారాల కోసం ఉపయోగించే కర్రలు 2 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉండకూడదని, బాటసారులపై రంగులు చల్లరాదని పేర్కొన్నారు. ఊరేగింపులో ఎలాంటి రాజకీయ, రెచ్చగొట్టే ప్రసంగాలు, నినాదాలు చేయరాదని, బ్యానర్లు ప్రదర్శించకూడదని వివరించారు. బాణసంచా కాల్చరాదని తెలిపారు.